ఇదే నా చివరి ప్రపంచకప్.. ఇక నా శరీరాన్ని కష్టపెట్టదలచుకోలేదు: గేల్ భావోద్వేగం
- విజయంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన విండీస్
- ప్రపంచకప్ గెలిచి ఉంటే సంతోషించేవాడిని
- ఈ ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చిందన్న గేల్
క్రికెట్లో తన ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందన్నాడు. యువ ఆటగాళ్లు తనతో కలిసిపోయారని, జట్టులోని ప్రతి ఒక్కరు తనకు ఎంతో సహకరించారని అన్నాడు. తనకు మాట్లాడేందుకు మాటలు కూడా రావడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యాడు. తనకు ఎన్నో సలహాలు, సూచనలు అందించి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఇకపై శరీరాన్ని కష్టపెట్టదలచుకోలేదన్న గేల్.. ప్రపంచకప్‌ను గెలవకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుందన్నాడు. తాను రిటైర్ అయినా జట్టుకు తోడుగా ఉంటానని చెప్పుకొచ్చాడు.