Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రమాదంలో మరణించిన సుబ్రహ్మణ్యం కుమార్తెకు ఉద్యోగం

  • గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన సింధు సుబ్రహ్మణ్యం
  • గ్రూప్-1 ర్యాంక్ తో డిప్యూటీ కలెక్టర్ గా నియామకం  
  • ఉత్తర్వులు జారీచేసిన ఏపీ సర్కారు
పదేళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆనాడు వైఎస్సార్ తో పాటు ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కూడా ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సుబ్రహ్మణ్యం సీఎంకు కార్యదర్శిగా వ్యవహరించారు. ఇప్పుడాయన కుమార్తె సింధు సుబ్రహ్మణ్యంకు ఏపీ సర్కారు ఉద్యోగం కల్పించింది. ఆమెను రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 సర్వీసు కింద డిప్యూటీ కలెక్టర్ గా నియమించింది. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. సింధు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆమెను ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తున్నట్టు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఆదేశాలు జారీచేశారు.
Andhra Pradesh
YSR
Jagan

More Telugu News