ఇదే ధోనీ అయితేనా!.... సచిన్ కామెంట్ కు సుందర్ పిచాయ్ రిప్లయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇదే ధోనీ అయితేనా!.... సచిన్ కామెంట్ కు సుందర్ పిచాయ్ రిప్లయ్

  • భారత్-బంగ్లా మ్యాచ్ ను కలిసి వీక్షించిన సచిన్, పిచాయ్
  • ఫొటో ట్వీట్ చేసిన సచిన్
  • ధోనీ విషయం ప్రస్తావించిన పిచాయ్
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వరల్డ్ కప్ లో టీమిండియా, బంగ్లాదేశ్ లీగ్ మ్యాచ్ ను కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా తామిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోను సచిన్ ట్విట్టర్ లో పోస్టు చేసి, క్యా యే సుందర్ పిక్ హై? (kya yeh sundar pic-hai?) అంటూ కామెంట్ చేశారు. విషయం ఏంటంటే, సచిన్ తన కామెంట్ లో సుందర్ పిచాయ్ పేరులోని పిచాయ్ అనే పదాన్ని హిందీలో పిక్ హై (pic-hai) అంటూ విడదీసి చమత్కారం చేశారు. ఇక, సచిన్ పోస్టు చేసిన తమ ఫొటోపై సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. అదే మహీ భాయ్ అయితే, "బహుత్ బడీయా" అంటూ స్పందించేవాడని, ఏదేమైనా సచిన్ తో కలిసి మ్యాచ్ చూసినందుకు ఎంతో సంతోషంగా ఉందని, తదుపరి సమావేశం వరకు ఈ అనుభూతి చాలని పేర్కొన్నారు.
Sachin Tendulkar
Sundar Pichai

More Telugu News