18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు త్వరలో జైలుకే!: బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు
- చంద్రబాబు, మంత్రులు తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారు
- మునిగిపోతున్న నావ నుంచి వారు బయటపడాలనుకుంటున్నారు
- ఐఏఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ కార్యదర్శి
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ కు ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవ్ ధర్ ఈ మేరకు మాట్లాడారు. ప్రస్తుతం ఏపీలోని ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో లక్ష మంది కొత్త సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలకు దగ్గర అయ్యేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. టీడీపీకి ఏపీలో భవిష్యత్ లేదని దేవ్ ధర్ పునరుద్ఘాటించారు. చంద్రబాబు మెడపై అరెస్టు కత్తి వేలాడుతోందనీ, ఏ క్షణమైనా ఆయన కటకటాల వెనక్కు వెళతారని పేర్కొన్నారు.