గుండెలు పిండేస్తున్న వీడియో.. చనిపోయిన తల్లిని తట్టి లేపుతున్న ఖడ్గమృగం పిల్ల
- కొమ్ముల కోసం ఖడ్గమృగాలను చంపేస్తున్న వేటగాళ్లు
- పాల కోసం అలమటిస్తూ తల్లిని తట్టిలేపుతున్న పిల్ల
- ఇది వినాశనకరమన్న ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్
తాజాగా, భారత అటవీ అధికారి షేర్ చేసిన వీడియో మరోమారు ఈ ఘటనను కళ్లకు కడుతోంది. వేటగాళ్ల చేతిలో బలైన తన తల్లిని లేపేందుకు పిల్ల ఖడ్గమృగం ప్రయత్నిస్తోందని, ఇది వినాశనకరమే కాకుండా కళ్లు తెరవాల్సిన సమయమని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ పేర్కొన్నారు. పాల కోసం అలమటిస్తున్న ఆ పిల్ల తల్లిని తట్టి లేపుతుండడం హృదయవిదారకంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.