అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్న యువకుడు... అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్న యువకుడు... అరెస్ట్!

  • యువతుల చిత్రాలను అశ్లీలంగా మారుస్తున్న వినోద్
  • యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
అమ్మాయిల ఫొటోలు తన చేతికి చిక్కితే, వాటిని మార్ఫింగ్‌ చేసి, ఆన్ లైన్లో అప్ లోడ్ చేయడం, ఆపై వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న దుర్మార్గుడికి హైదరాబాద్‌ పోలీసులు చెక్ చెప్పారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, విశాఖపట్నానికి చెందిన వినోద్‌ అనే యువకుడు, సోషల్ మీడియా ద్వారా ఆకర్షణీయంగా కనిపించే అమ్మాయిల ఫొటోలను సేకరించి, వాటిని మార్ఫింగ్ చేసి వెబ్‌ సైట్లలో పెడుతున్నాడు.

అతని చర్యలపై ఓ యువతి ఫిర్యాదు చేయగా, సైబర్‌ క్రైమ్ పోలీసులు, ఐపీ అడ్రస్ ద్వారా విచారణ జరిపి, నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం ఉంచడం ద్వారానే ఇటువంటి నేరాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Hyderabad
Police
Morfing
Arrest

More Telugu News