టిక్ టాక్ ను నిషేధించండి: లోక్ సభలో గల్లా జయదేవ్

  • యువత చెడు దారి పట్టే అవకాశం ఉంది
  • ఎన్నికల ప్రచారంలో కూడా ఈ యాప్ ను వినియోగించుకున్నారు
  • టిక్ టాక్ వల్ల కలుగుతున్న నష్టాలను వివరించిన గల్లా జయదేవ్
ప్రస్తుతం మన దేశంలో అనేక మంది టిక్ టాక్ కు బానిసలవుతున్నారు. ఈ సామాజికమాధ్యమంలో వస్తున్న వీడియోలు చూసి యువత చెడిపోతోందనే భావన రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, మన దేశంలో టిక్ టాక్ ను నిషేధించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. లోక్ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, టిక్ టాక్ వల్ల కలుగుతున్న నష్టాన్ని వివరించారు. ఈ యాప్ వల్ల యువత చెడు దారి పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూడా టిక్ టాక్ ను వినియోగించుకున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
Go Back to Shorts
galla jayadev
lok sabha
tik tok
Telugudesam

More Telugu News