అంబటి రాయుడికి మద్దతుగా నిలిచిన హీరో సిద్ధార్థ్!
- అంతర్జాతీయ క్రికెట్ కు అంబటి రాయుడు రిటైర్మెంట్
- రాయుడు ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాడన్న సిద్ధార్థ్
- అతని భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వ్యాఖ్య
అదే సమయంలో భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ వ్యవహారశైలిని కూడా హీరో సిద్ధార్థ్ తీవ్రంగా తప్పుపట్టాడు. ‘ఈరోజు నాకు ఐపీఎల్ కు తల్లి అయిన ఐసీఎల్(ఇండియన్ క్రికెట్ లీగ్) గుర్తుకువస్తోంది. ఓ లెజండ్ ఆటగాడిని అనుసరించి యువ క్రికెటర్లు అంతా అందులోకి అడుగుపెట్టారు. అప్పుడే బీసీసీఐ అన్యాయంగా ఆ లీగ్ ను మూసివేయించింది. దీంతో వందలాది మంది నైపుణ్యమున్న యువ క్రికెటర్లను తమ భవిష్యత్ కోసం పోరాడేలా చేసింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.