కరకట్టపై అక్రమ నిర్మాణాలు.. బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు సహా ఐదుగురికి సీఆర్డీఏ నోటీసులు!
- అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
- లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
- ఇప్పటికే లింగమనేని, మంతెనలకు నోటీసులు ఇచ్చిన సీఆర్డీఏ
బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుతో పాటు నెక్కంటి వెంకట్రావు, వేదాద్రి మహర్షి తపోవనం, దివి సత్యసాయి, అట్లూరి శాంతిచంద్రలకు చెందిన భవనాలకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించారు. ఈ అక్రమ కట్టడాలపై వారం రోజుల్లోగా జవాబు చెప్పాలనీ, లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.