మ్యాచ్ ముగిశాక 87 ఏళ్ల వృద్ధ అభిమానిని కలిసిన రోహిత్, కోహ్లీ.. ముద్దిచ్చి ఆశీర్వదించిన బామ్మగారు!
- క్రికెట్‌పై ఆమెకున్న అభిరుచికి ప్రేక్షకులు ఫిదా
- కలిసి మాట్లాడిన కెప్టెన్, వైస్ కెప్టెన్
- వీడియో, ఫొటోలు పోస్టు చేసిన కోహ్లీ
మ్యాచ్ ముగిశాక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆమెను ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. ఇద్దరి భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న చారులత వారి చెంపలపై ముద్దుపెట్టి ఆశీర్వదించింది. చారులతను కలిసిన ఫొటోలను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా, ఐసీసీ వీడియోను పోస్టు చేసింది. తమకు మద్దతు పలికిన ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు.
క్రికెట్‌పై ఆమెకున్న అభిరుచి, అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. తానెప్పుడూ ఇలాంటి అభిమానిని చూడలేదన్నాడు. వయసు అనేది ఒక నంబరు మాత్రమేనని, అభిరుచి హద్దులను చెరిపేస్తుందని పేర్కొన్నాడు. ఇక నుంచి ఆమె ఆశీస్సులు తమకు ఉంటాయని ఆకాంక్షించాడు. అలాగే, అభిమానులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపాడు.