ఏపీ ఎంసెట్ ఎంపీసీ ప్రవేశాల కౌన్సిలింగ్ లో మార్పు: మంత్రి ఆదిమూలపు సురేశ్
- కౌన్సెలింగ్ 8వ తేదీ నుంచి షురూ
- ర్యాంకుల ఆప్షన్లు మార్చుకునే తేదీ 14కి మార్పు
- ధ్రువపత్రాల పరిశీలన గడువు ఈ నెల 7వరకు పొడిగింపు
ఇక 75,001 నుంచి చివరి ర్యాంకు వరకు 7,8 తేదీల్లో జరగాల్సిన కౌన్సెలింగ్ 12, 13 తేదీలకు మార్చినట్టు చెప్పారు. ర్యాంకుల ఆప్షన్లు మార్చుకునే తేదీని 9 నుంచి 14వ తేదీకి మార్పు చేసినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. అంతేగాకుండా, ఈ నెల 11న వెబ్ సైట్ లో సాయంత్రం ఆరింటికి జరిగే కేటాయింపు 16వ తేదీకి మార్చినట్టు వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలన గడువును ఈ నెల 7వరకు పొడిగించామని ఆయన తెలిపారు.