మా సినిమా విషయంలో మేం ఎందుకు పట్టించుకోకుండా ఉంటాం?: జీవిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా సినిమా విషయంలో మేం ఎందుకు పట్టించుకోకుండా ఉంటాం?: జీవిత

  • కల్కి దర్శకత్వంలో జోక్యం చేసుకున్నారట కదా అంటూ విలేకరి ప్రశ్న
  • అలాంటి ప్రశ్నలు అడగకూడదంటూ జీవిత క్లాస్
  • ఎలాంటి సలహాలు ఇచ్చారని అడిగితే బాగుండేదంటూ హితవు
నటి, దర్శకురాలు, నిర్మాత జీవిత రాజశేఖర్ ప్రస్తుతం కల్కి చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవిత కూడా పాల్గొన్నారు. అయితే, ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నతో జీవిత అసహనానికి గురయ్యారు. కల్కి చిత్రీకరణ సందర్భంగా మీరు డైరెక్షన్ లో జోక్యం చేసుకున్నారట కదా! అంటూ ఆ రిపోర్టర్ జీవితను అడిగాడు. అందుకు జీవిత చాలా బాధపడ్డారు.

"రూ.20 కోట్ల ఖర్చుతో కల్కి సినిమాను నిర్మించినప్పుడు, ఆ సినిమా ఎలా తెరకెక్కుతుందోనన్న ఆందోళన నిర్మాణ బాధ్యతల్లో ఉన్నవారికి ఉంటుందా? లేదా? ముందు మాకు నచ్చితేనే కదా, ఆ తర్వాత జనాలకు నచ్చేది! మా సినిమా విషయంలో మేం ఎందుకు పట్టించుకోకుండా ఉంటాం? మీరు ప్రశ్న అడిగిన విధానం సరిగా లేదు. దర్శకత్వపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనో, లేకపోతే, దర్శకత్వ విభాగానికి ఏమైనా సలహాలు ఇచ్చారనో మీరు అడిగితే బాగుండేది. జోక్యం చేసుకున్నారని అడగడం సరికాదు. అయినా నేను మీతో వివాదం పెట్టుకోవడంలేదు, మీ ప్రశ్నలు మాకెంత బాధ కలిగిస్తున్నాయో వివరిస్తున్నాను" అంటూ సుదీర్ఘంగా మాట్లాడారు.
Jeevitha
Rajasekhar
Kalki
Tollywood

More Telugu News