మీరు నమ్ముతారో లేదో .. నిజంగానే నేను దెయ్యాన్ని చూశాను: నటి లతాశ్రీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీరు నమ్ముతారో లేదో .. నిజంగానే నేను దెయ్యాన్ని చూశాను: నటి లతాశ్రీ

  • అది కన్నడ సినిమా షూటింగు 
  • రాత్రివేళలో షూటింగ్ జరుగుతోంది
  • హాస్పిటల్ పైఅంతస్తు నుంచి పరిగెత్తుకొచ్చేశానన్న లతాశ్రీ
తెలుగు .. కన్నడ భాషా చిత్రాలలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన లతాశ్రీ, ఆ తరువాత ఈ రెండు భాషల్లోను కలిసి 70 సినిమాల వరకూ చేశారు. వివాహం తరువాత సినిమాలకి దూరమైన ఆమె, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

"కన్నడలో నేను చాలా సినిమాలు చేశాను. ఒక కన్నడ సినిమా షూటింగు హాస్పిటల్లో జరుగుతోంది. అర్ధరాత్రివేళలో అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగు గ్యాప్ లో అలా నడచుకుంటూ హాస్పిటల్  పై అంతస్తుకి వెళ్లాను. ఒక లేడీ తెల్లచీరకట్టుకుని .. జుట్టు విరబోసుకుని గోడపై కూర్చుకుని ఉండటం నేను చూశాను. నా అలికిడికి ఆమె మాయమైపోగానే దెయ్యమనే విషయం అర్థమై భయంతో కిందకి పరిగెత్తుకు వచ్చాను. పై అంతస్తులో మార్చ్యురీ ఉందని తెలిసి మరింత భయపడిపోయాను. మీరు నమ్మినా .. నమ్మకపోయినా నిజంగానే నేను దెయ్యాన్ని చూశాను" అని ఆమె చెప్పుకొచ్చారు.
lathasri

More Telugu News