సెల్ ఫోన్లలో స్థానిక యువతుల అశ్లీల వీడియోలు... మొగల్తూరులో తీవ్ర కలకలం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెల్ ఫోన్లలో స్థానిక యువతుల అశ్లీల వీడియోలు... మొగల్తూరులో తీవ్ర కలకలం!

  • పలువురిని మోసం చేసిన యువకుడు
  • అతని వీడియోలను తస్కరించిన మరో యువకుడు
  • వీడియోలన్నీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో స్థానిక యువతుల అశ్లీల వీడియోల కలకలం రేగింది. తన మాయమాటలతో పలువురు యువతులను వంచించిన ఓ యువకుడు, వారితో అత్యంత సన్నిహితంగా గడిపి, వాటిని వీడియోలు తీయగా, ఆ విషయం తెలిసిన మరో యువకుడు, వాటిని దొంగిలించి లోకల్ గ్రూప్ లలో పోస్ట్ చేయడం తీవ్ర సంచలనం అయింది. ఈ విషయమై ధైర్యం చేసిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, పట్టణంలో సెల్‌ ఫోన్లను మరమ్మతులు చేసుకునే ఓ యువకుడు, తన వద్దకు వచ్చే అమ్మాయిలు, యువతులను వంచించి, వారిని బుట్టలో వేసుకునేవాడు. వారితో ఏకాంతంగా గడుపుతూ వీడియోలు తీసుకున్నాడు. అదే దుకాణంలో ఫోన్ల మరమ్మతు పనులను నేర్చుకునేందుకు వచ్చిన మరో యువకుడు ఈ వీడియోలను చూసి, మరికొంత మందికి షేర్ చేశాడు. వాటిని చూసిన మరో యువకుడు, బాధితురాళ్లను డబ్బు కోసం బెదిరించినట్టు తెలుస్తోంది. ఎక్కడా బేరాలు కుదరకపోవడంతో అన్ని వీడియోలనూ వాట్స్ యాప్ గ్రూపుల్లోకి ఫార్ వార్డ్ చేసేశాడు.

దీంతో పట్టణ వ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఇదే విషయాన్ని చర్చించుకుంటుండగా, ఓ బాధితురాలు మొగల్తూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సెల్ ఫోన్లను రిపేర్ చేసే వ్యక్తిని, అతని నుంచి వీడియోలు దొంగిలించిన యువకుడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తికి కొందరు రాజకీయ నాయకుల అండ ఉన్నట్టు, వారు కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 
Social Media
Mogalturu
Cellphone
Viral

More Telugu News