Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వివాహమైన వారానికే... స్నేహితురాలితో పారిపోయిన నవ వధువు!

  • తమిళనాడులోని నాగర్ కోయిల్ లో ఘటన
  • స్నేహితురాలితో స్వలింగ సంపర్కం
  • పారిపోవడంతో కేసు నమోదు
వివాహమైన వారం రోజులకే ఓ నవ వధువు తన స్నేహితురాలితో కలిసి పారిపోయింది. స్నేహితురాలితో ఉన్న స్వలింగ సంపర్కం కారణంగానే ఆమె ఉడాయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌ కు సమీపంలో ఈ ఘటన జరిగింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ప్రాంతానికి చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వారం రోజుల క్రితం వివాహంకాగా, రెండు రోజుల క్రితం ఆమె అదృశ్యమైంది. భర్తపై అనుమానం వచ్చి, యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు అతన్ని విచారించారు. పెళ్లి తరువాత తనను దగ్గరకు రానివ్వలేదని, అసలామె ఇష్టపూర్వకంగా మాట్లాడను కూడా లేదని చెప్పడంతో, ఏదైనా ప్రేమ వ్యవహారం కారణంగా ఆమె వెళ్లిపోయి ఉండవచ్చని భావించి, ఆ దిశగా విచారణ ప్రారంభించారు.

ఆమె స్నేహితురాలిని పోలీసులు విచారించగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరునల్వేలి జిల్లా పనకుడికి చెందిన మరో అమ్మాయితో ఆమె సన్నిహితంగా ఉండేదని, చదువుకునే రోజుల్లో హాస్టల్‌ లో ఉన్నప్పుడు స్వలింగ సంపర్కానికి అలవాటు పడి, తమకు కనిపించారని వారు చెప్పారు. దీంతో పనకుడికి పోలీసులు వెళ్లగా, ఆమె కూడా కనిపించడం లేదని తేలింది. దీంతో ఇద్దరూ పరారయ్యారని పోలీసులు నిర్దారించారు. సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, వారు చెన్నైకి చేరుకున్నారని గుర్తించారు. చెన్నైలో వారు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు విచారణ జరుపుతున్నామని అన్నారు.
Lesbian
Tamilnadu
Lover
Marriage

More Telugu News