'పోలవరం'లో అవినీతి జరిగిందంటూ పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు.. కేంద్ర జలవనరుల శాఖ స్పందన!
- అవినీతిపై ఫిర్యాదు చేసింది మీరేనా అని ప్రశ్న
- అందుకు సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుందని వ్యాఖ్య
- లేదంటే విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
‘మీ ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారా? అందుకు తగ్గ సాక్ష్యాధారాలు ఉన్నాయా? దర్యాప్తు అధికారికి ఈ విషయంలో సహకరిస్తారా?ఒకవేళ ఆరోపణలు రుజువు చేయలేని పక్షంలో నిబంధనల ప్రకారం మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఫిర్యాదును విస్మరిస్తాం. ఏ విషయమూ 15 రోజుల్లోగా జవాబు ఇవ్వండి’ అని కేంద్ర జలవనరుల నిఘా విభాగం లేఖ రాసింది. దీంతో పుల్లారావు స్పందిస్తూ .. ఫిర్యాదు చేసిందని తానేనని కేంద్రానికి తెలిపారు.