షమీ అటాక్... రెండు పరుగుల తేడాతో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

  • బెయిర్ స్టో, మోర్గాన్ లను అవుట్ చేసిన షమీ
  • ఇంగ్లాండ్ 39 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగులు
  • బర్మింగ్ హామ్ మ్యాచ్
ఇటీవల సూపర్ ఫామ్ లో ఉన్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో వెంటవెంటనే రెండు వికెట్లు తీసి టీమిండియా శిబిరంలో ఆనందోత్సాహాలు రేకెత్తించాడు. బర్మింగ్ హామ్ లో సెంచరీ చేసి మరింత ఎదురుదాడికి దిగుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టోను అవుట్ చేసిన షమీ, ఆ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ కు తిప్పిపంపాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 39 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. జో రూట్ 31, బెన్ స్టోక్స్ 15 పరుగులతో ఆడుతున్నారు.
Go Back to Shorts
Shami
India
England
World Cup

More Telugu News