మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను కలిసిన ఉండవల్లి రైతులు
- చంద్రబాబు నివాసానికి వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం భూమి ఇచ్చాం
- సీఎం పదవి నుంచి చంద్రబాబు దిగిపోయారు
- ఒప్పందం ప్రకారం మా భూమి మాకు ఇచ్చివేయాలి
ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే, అధికారుల నుంచి తనకు ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. సీఎం పదవి నుంచి చంద్రబాబు దిగిపోయారు కనుక, ఒప్పందం ప్రకారం తన భూమి తనకు ఇచ్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు, జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించనున్నట్టు తెలిపారు.
మరో రైతు బాలకోటయ్య మాట్లాడుతూ, చంద్రబాబు నివాసం వద్ద తనకు 20 సెంట్ల భూమి ఉండేదని, ఆ భూమిలో లిల్లీలు, గులాబీలు పండించే వాడినని చెప్పారు. చంద్రబాబు నివాసం వద్ద రోడ్డు నిర్మాణం కోసం తన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని, తిరిగి తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు.
చంద్రబాబు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న భూమిని రైతులతో కలిసి ఆర్కే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ, తమది రాజన్న ప్రభుత్వమని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.