దైవత్వానికి దూరమైపోతున్నానంటూ సినీ రంగానికి గుడ్ బై చెప్పేసిన దంగల్ భామ
- దంగల్ లో చిన్ననాటి గీతా ఫోగట్ గా జైరా వాసిమ్
- మానసిక సమస్యలతో సతమతం
- ఫేస్ బుక్ లో పోస్టు
సినీ జీవితం కారణంగా మత విశ్వాసాలకు దూరమైన ఫీలింగ్ కలిగిందని, కెరీర్ కు, మతపరమైన నమ్మకాలకు పొసగదని అర్థం చేసుకున్నానని వివరించింది. జైరా తాజాగా ద స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కూడా నటించారు. సినిమా రంగంలో తాను సులభంగానే ఇమిడిపోగలనని, కానీ, అదే సమయంలో దేవుడికి దగ్గర కాలేకపోతున్నానని, ఇలాంటి మానసిక సంఘర్షణలతో చిత్రపరిశ్రమలో కొనసాగడం కంటే నిజమైన ప్రశాంతత కోసం సినీ రంగానికిదూరంగా వెళ్లిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నానని జైరా తెలిపింది. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది.