157 పరుగులకే కుప్పకూలిన కివీస్.. ఆసీస్ ఘన విజయం
- 86 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్
- అద్భుత స్పెల్‌తో అదరగొట్టిన మిచెల్ స్టార్క్
- ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా అలెక్స్ కేరీ
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ట్రెంట్ బౌల్ట్ హ్యాట్రిక్ దెబ్బకు 243 పరుగులకే పరిమితమైంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన బౌల్ట్.. ఉస్మాన్ ఖావాజా (88), మిచెల్ స్టార్క్ (0), బెహ్రెండార్ఫ్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ పంపి రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో కివీస్‌కు ఇదే తొలి హ్యాట్రిక్. కీలక సమయంలో 72 బంతుల్లో 11 ఫోర్లతో 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అలెక్స్ కేరీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో 14 పాయింట్లో ఆసీస్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లగా, న్యూజిలాండ్ 11 పాయింట్లో మూడో స్థానంలో ఉంది. ఆప్ఘనిస్థాన్‌పై చచ్చీచెడి గెలిచిన పాక్ 9 పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టేసి నాలుగో స్థానానికి చేరుకుంది.