విజయ్ శంకర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ
- అదృష్టం కూడా కలిసిరావాలి
- త్వరలోనే భారీ ఇన్నింగ్స్ ఆడతాడు
- విజయ్ శంకర్ కు మద్దతుగా మాట్లాడిన టీమిండియా సారథి
ఈ వరల్డ్ కప్ లోనే విజయ్ శంకర్ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ధీమాగా చెప్పాడు. ఇప్పటివరకు ఆడిన ఇన్నింగ్స్ ల్లో మెరుగైన దృక్పథం కనబర్చినా, ఆ ఇన్నింగ్స్ లను భారీ స్కోర్లుగా మలచాలంటే అదృష్టం కూడా కలిసిరావాలని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. "పాక్ పై బాగానే ఆడాడు. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లోనూ ఆధారపడదగ్గ ఆటగాడిగా కనిపించాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ లో బాగా ఆడుతున్న దశలో కీమార్ రోచ్ వేసి ఓ అద్భుతమైన బంతికి అవుటయ్యాడు" అంటూ విజయ్ శంకర్ కు దన్నుగా నిలిచాడు.