Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గెటప్ శ్రీను అంటే నాకు చాలా ఇష్టం: 'జబర్దస్త్' అప్పారావ్

  • మా టీమ్ లో నరేశ్ బాగా చేస్తాడు
  • గెటప్పులు వేయడంలో శీను దిట్ట
  • గెటప్ శీను తనే మేకప్ చేసుకుంటాడు
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో అప్పారావ్ ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "మా టీమ్ లో 'నాటీ నరేశ్' బాగా చేస్తాడు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో అవలీలగా ప్రవేశిస్తాడు. నరేశ్ స్టేజ్ పై వున్నాడంటే మిగతా ఆర్టిస్టులు కూడా జాగ్రత్తగా ఉండాలి.

ఇక వేరే టీమ్స్ లో చేసే వాళ్లలో 'గెటప్ శీను'ను ఎక్కువగా ఇష్టపడతాను. 'జబర్దస్త్'లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వివిధ రకాల గెటప్ లు వేస్తూ .. నాన్ స్టాప్ గా నవ్విస్తూ వస్తున్నాడు. తన పాత్రకి తగినట్టుగా డైలాగ్ డెలివరీనీ .. బాడీ లాంగ్వేజ్ ను మారుస్తాడు. అలాగే తన గెటప్ కి సంబంధించిన మేకప్ ను తనే చేసుకుంటాడు. 'జబర్దస్త్'లో అందరూ అభిమానించే వ్యక్తిగా .. నటుడిగా గెటప్ శీను కనిపిస్తాడు" అని చెప్పుకొచ్చాడు. 
appa rao
gueup srinu

More Telugu News