Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సూపర్ 30' సినిమాలో అప్పడాలు అమ్మే యువకుడిగా హృతిక్ రోషన్

  • హృతిక్ రోషన్ హీరోగా 'సూపర్ 30'
  • కథగా గణిత శాస్త్రవేత్త జీవితచరిత్ర
  • వచ్చేనెల 12వ తేదీన విడుదల 
మొదటి నుంచి కూడా హృతిక్ రోషన్ విభిన్నమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ, విలక్షణమైన నటుడిగా మంచి మార్కులు కొట్టేశారు. అలాంటి హృతిక్ రోషన్ తాజాగా 'సూపర్ 30' అనే సినిమా చేశారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అప్పడాలు అమ్ముకునే స్థాయి నుంచి ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.

ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ అప్పడాలు అమ్మే సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కండలు తిరిగిన దేహంతో హీ మ్యాన్ లా కనిపించే హృతిక్, ఓ బస్టాండ్ లో బస్సు కిటికీల దగ్గర నుంచుని అప్పడాలు అమ్ముతున్న ఈ స్టిల్ ఆశ్చర్యచకితులను చేస్తోంది. తన స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టేసి హృతిక్ చేసిన ఈ పాత్ర ఆయన క్రేజ్ ను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చేనెల 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
hrithik roshan

More Telugu News