సీఎం జగన్ కు ప్రతిరోజూ లేఖ రాస్తా: అఖిలప్రియ
- అధికారులు సీఎం మాటలు పట్టించుకోవడంలేదు
- రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా నేరుగా జగన్ కే తెలియజేస్తాం
- అక్రమకట్టడాలన్నీ కూలగొడితే స్వాగతిస్తాం
చంద్రబాబు నిర్మించారన్న కారణంతోనే ప్రజావేదికను కూలగొట్టడం సరికాదని, రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్రమకట్టడాన్ని కూలగొడితే తాము కూడా హర్షిస్తామని చెప్పారు. చంద్రబాబునాయుడు నివాసం పరిసరాల్లో అనాథాశ్రమాలు, ఆసుపత్రులు ఉన్నాయని వాటిని కూడా కూల్చివేస్తారా? అంటూ ప్రశ్నించారు.