ప్రజావేదిక నిర్మాణంలో సిమెంట్ కంటే ‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్’ను ఎక్కువగా వాడారనిపిస్తోంది!: విజయసాయిరెడ్డి
- రూ.కోటి ఖర్చయ్యే రేకుల షెడ్డుకు రూ.9 కోట్లు వెచ్చించారు
- బాబు హయాంలో నిర్మాణాలన్నీ ఇంతే
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
ప్రజావేదిక కూల్చివేత దగ్గరకు వచ్చిన ప్రజలకు ఉన్న అవగాహన కూడా టీడీపీ నేతలకు లేకుండా పోయిందని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. ‘రాజధాని కోసం మా నుంచి 33,000 ఎకరాలు సేకరించారు. ప్రజావేదికను కరకట్ట మీద కాకుండా రాజధాని భూముల్లోనే నిర్మించి ఉంటే ఈరోజు ప్రజాధనం వృధా అయ్యేది కాదు కదా’ అని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.