vijaya nirmala: విజయనిర్మల మృతిపట్ల చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన
- ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన చంద్రబాబు, లోకేశ్
- గొప్ప దర్శకురాలంటూ చంద్రబాబు కితాబు
- సినీ రంగంలో సమున్నత స్థానానికి చేరుకున్నారన్న లోకేశ్
సినీ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. నటిగానే కాకుండా ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన ఘనత ఆమె సొంతమని కొనియాడారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్ రికార్డులకెక్కారని తెలిపారు. విజయనిర్మల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
విజయనిర్మల మరణం పట్ల మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ... హీరో కృష్ణగారి సతీమణి విజయనిర్మలగారి మరణం విచారకరమని అన్నారు. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. విజయనిర్మల కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. దర్శకురాలిగా విభిన్న చిత్రాలను తెరకెక్కించి... చలనచిత్ర రంగంలో సమున్నత స్థానానికి చేరుకున్నారని అన్నారు.