మీకు తెలుసా?... హీరో కృష్ణకు చెల్లిలిగానూ చేసిన విజయనిర్మల!

గిన్నిస్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకురాలు విజయనిర్మల, తన నిజ జీవిత హీరో, సూపర్ స్టార్ కృష్ణకు సోదరిగానూ నటించిన సినిమాలు ఉన్నాయని తెలుసా? వీరిద్దరూ ప్రేమలో పడ్డ తరువాతే ఆ చిత్రాలు వెండితెరను తాకాయి. విజయనిర్మల, కృష్ణలు కలిసి దాదాపు 50 చిత్రాల్లో నటించినా, 'బొమ్మలు చెప్పిన కథ', 'మంచి మిత్రులు', 'ముహూర్త బలం' చిత్రాల్లో ఆమె కృష్ణకు సోదరిగా నటించారు. 'మంచి మిత్రులు' చిత్రంలో శోభన్ బాబు హీరో. అయితే, ఈ మూడు చిత్రాలూ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమై, ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో తామిద్దరమూ అన్నా చెల్లెలుగా ప్రేక్షకులను మెప్పించలేమన్న నిర్ణయానికి వచ్చేసిన విజయనిర్మల, కృష్ణతో కలిసి హీరోయిన్ గా తప్ప మరో పాత్ర చేయరాదని నిర్ణయించుకున్నారు. 

Krishna
Vijaya Nirmala
Movies
Sister

More Telugu News