తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ పార్కింగ్ కాంట్రాక్టుకు భారీ ధర.. ఈసారి కాంట్రాక్ట్ ఎవరిదంటే?
తిరుమల యాత్రికులకు ఎంతో కీలకమైన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలోని ప్రైవేట్ టూరిస్ట్ బస్టాండ్ పార్కింగ్ వార్షిక వేలం పాట పూర్తయింది. ఈ ఏడాది పార్కింగ్ రుసుము వసూలు చేసే కాంట్రాక్టును కిరణ్ రెడ్డి అనే వ్యక్తి రూ.3,15,40,000కు దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి వేలం మొత్తం తగ్గడం గమనార్హం.
గ్రామ పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో డీఎల్‌పీవో సురేష్‌నాయుడు, డిప్యూటీ ఎంపీడీవో దయాసాగర్, పంచాయతీ కార్యదర్శి మణి ఈ వేలం ప్రక్రియను పర్యవేక్షించారు. మార్చి 31తో పాత కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ఏప్రిల్ 1 నుంచి పంచాయతీ సిబ్బందే పార్కింగ్ రుసుములను వసూలు చేస్తున్నారు. కొత్త కాంట్రాక్టర్‌కు ఈ నెల 20 తర్వాత బస్టాండ్‌ను అప్పగించనున్నట్లు, ఆయన 11 నెలల పాటు రుసుం వసూలు చేసుకునేందుకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. గతేడాది ఈ బస్టాండ్ వేలం రూ.3.51 కోట్లు పలికింది.
గతేడాది ఇదే వేలం పాట తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. కాంట్రాక్ట్ కోసం రెండు వర్గాలు పోటీపడి, టెండర్ పత్రాలను లాక్కోవడంతో గందరగోళం చెలరేగింది. ఆ అనుభవాల దృష్ట్యా ఈసారి అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. బస్టాండ్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వేలం ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేశారు. దీంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.