జేసీ దివాకర్ రెడ్డి తోటకు నిప్పు పెట్టిన దుండగులు

JC Diwakar Reddys farm set on fire in Anantapur

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన చింత తోటకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.


జూటూరు గ్రామంలోని 60 ఎకరాల విస్తీర్ణంలోని తోటలో చింత మొక్కలను నాటి పెంచుతున్నారు. ఆదివారం రాత్రి దుండగులు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో, తోటలోని 30 ఎకరాల్లోని చింత చెట్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతోపాటు, బిందు సేద్యం కోసం ఏర్పాటు చేసిన పైపులు, పరికరాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. నష్టం రూ. 5 లక్షల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 


తోట కాపలా సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై జేసీ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.
Go Back to Shorts
JC Diwakar Reddy
Anantapur
Juturu Village
Andhra Pradesh
Fire Accident
Crops burnt
Political rivalry
Property damage
Police investigation

More Telugu News