Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోషల్ మీడియాలో సచిన్ ఫ్యాన్స్, ధోనీ ఫ్యాన్స్ మధ్య రగడ

  • ధోనీ బ్యాటింగ్ పై సచిన్ వ్యాఖ్యలు
  • మండిపడ్డ ధోనీ ఫ్యాన్స్
  • సచిన్ కు మద్దతుగా రంగంలోకి దిగిన అభిమానులు
కొన్నిరోజుల క్రితం ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా ధోనీ నిదానంగా బ్యాటింగ్ చేయడంపై సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. దీనిపై ధోనీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ధోనీ మూడు ఫార్మాట్లలో ఇండియాకు టైటిళ్లు అందించాడన్న విషయం సచిన్ తెలుసుకోవాలని, సచిన్ సహా మరే కెప్టెన్ కూడా సాధించలేని ఘనతలు ధోనీ సొంతమని ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ ట్రోలింగ్ లోకి ఇప్పుడు సచిన్ ఫ్యాన్స్ కూడా ఎంటరయ్యారు.

"సచిన్ ను ప్రశ్నిస్తున్న వెధవలు సచిన్ కెరీర్ మొదలుపెట్టేనాటికి ఇంకా పుట్టివుండరు. వాళ్ల వయస్సు సచిన్ కెరీర్ కంటే చాలా చిన్నది. వాళ్లు ఐపీఎల్ మాత్రమే క్రికెట్ అనుకుంటున్నట్టుంది. సింహాన్ని చూసి కుక్కలు మొరగడం సహజమే, అందుకే వాళ్ల కామెంట్లు పట్టించుకోకండి అంటూ సచిన్ ఫ్యాన్స్ తమ ఆరాధ్య క్రికెటర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. సచిన్ అంటే ఏంటో ధోనీ, కోహ్లీలే బాగా చెబుతారు అంటూ సచిన్ రిటైర్మెంట్ వేళ ధోనీ, కోహ్లీ తమ భుజాలపై మోస్తున్న ఫొటోను పోస్టు చేశారు.
Sachin Tendulkar
MS Dhoni
Cricket

More Telugu News