ఆస్ట్రేలియాలో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి హఠాన్మరణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి హఠాన్మరణం

  • ఆఫీసులో ఉండగా గుండెపోటు
  • వెంటనే భార్యకు ఫోన్ ద్వారా సమాచారం
  • సహోద్యోగులు ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూత
హైదరాబాద్ కు చెందిన సామ అర్జున్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆస్ట్రేలియాలో హఠాన్మరణం చెందాడు. అర్జున్ రెడ్డి సిడ్నీలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం ఆఫీసులో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే భార్యకు ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అర్జున్ రెడ్డి అస్వస్థతకు లోనవడంతో ఆఫీసు సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. ఆయన వయసు 36 సంవత్సరాలు. హైదరాబాద్ లోని వనస్థలిపురం బీడీఎల్ కాలనీ వాసి ఆయన. ఇంజినీరింగ్ అనంతరం ఆస్ట్రేలియా వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఆపై అక్కడే ఉద్యోగంలో చేరాడు. అర్జున్ రెడ్డికి మహేశ్వరితో వివాహం జరిగింది. వీరికి ఇషిక అనే కుమార్తె ఉంది.
Hyderabad
Australia

More Telugu News