ఇందిరాగాంధీ.. గంగానది, మోదీ.. మురికి కాల్వ: అధిర్ రంజన్ తీవ్ర వ్యాఖ్యలు

  • ‘ఎక్కడ గంగా మాత, ఎక్కడ మురికి కాల్వ’
  • లోక్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన అధిర్
  • ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతల మండిపాటు
ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ లోక్ సభా పక్షనేత అధిర్ రంజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గంగానదితోనూ, మోదీని మురికి కాల్వగానూ పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంపై లోక్ సభలో ఈరోజు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అధిర్ రంజన్ మాట్లాడుతూ, బీజేపీ, మోదీపై ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎక్కడ గంగా మాత, ఎక్కడ మురికి కాల్వ (కహా మా గంగా, కహా గందీ నాలి)? అంటూ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని విరుచుకుపడ్డారు. ఇదిలాంఉండగా, మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం అధిర్ రంజన్ కు కొత్తేమీ కాదు. గతంలో మోదీని ‘సేల్స్ మ్యాన్’ గా ఆయన అభివర్ణించారు. మోదీ ముందు తాము ఉత్పత్తులను విక్రయించలేకపోయామని సెటైర్లు విసిరారు. 
Go Back to Shorts
congress
adhir ranjan
Indira Gandhi
Modi
Pm

More Telugu News