సచిన్ ను సన్మానించేందుకు తొమ్మిదేళ్ల ఎదురుచూపులు.... విసిగిపోయిన బీఎంసీ తీవ్ర నిర్ణయం
- 2010లో 50వ సెంచరీ సాధించిన సచిన్
- సచిన్ ను సన్మానించాలని ప్రతిపాదించిన కాంగ్రెస్ కార్పొరేటర్
- సచిన్ రాకపోవడంతో బీఎంసీ వర్గాల్లో చల్లారిన ఉత్సాహం
అయితే, సచిన్ అపాయింట్ మెంట్ దొరకడానికి బీఎంసీకి ఏళ్లు పట్టింది. ఆ తర్వాత సచినే అదిగో, ఇదిగో అంటూ తాత్సారం చేయడంతో . ఓసారి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినా సచిన్ హాజరుకాలేదు. ఆ విధంగా తొమ్మిదేళ్లు గడిచిపోవడంతో మరికొన్నేళ్లు గడచిపోయాయి. దాంతో, ఇంకా సచిన్ వస్తాడని ఎదురుచూడడంలో అర్థంలేదని భావించిన బీఎంసీ సన్మానం ఆలోచనను పూర్తిగా పక్కనపెట్టేసింది.
దీనిపై బీఎంసీ అధికారులు మాట్లాడుతూ, తాము సన్మానించాలని నిర్ణయించుకున్న తర్వాత సచిన్ భారతరత్న, మహారాష్ట్ర భూషణ్ వంటి గొప్ప పురస్కారాలు అందుకున్నాడని, ఇప్పుడు ఓ చిరు సత్కారానికి సచిన్ వస్తాడని ఎదురుచూడడం వ్యర్థమని భావించి కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నామని తెలిపారు.