బోరు బావిలో పడ్డ ఇద్దరు చిన్నారులు.. శ్రమిస్తున్న సహాయక సిబ్బంది
- పోలీసులకు సమాచారం అందించిన కుటుంబీకులు
- బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు
- పది అడుగుల లోతులో చిన్నారులు
ప్రస్తుతం జేసీబీతో బోరుబావికి సమాంతరంగా మట్టిని తవ్వుతున్నారు. అయితే ఇద్దరు చిన్నారులు పది అడుగుల లోతులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా.. సహాయక చర్యలు సుమారు గంట నుంచి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మరోవైపు చిన్నారుల కుటుంబీకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.