18 నుంచి 20 కమిటీలు వేస్తున్నాం: పవన్ కల్యాణ్
- ‘జనసేన’ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే వారికి ప్రాధాన్యత
- పార్టీ నేతల నుంచి మరిన్ని సలహాలు, సూచనలు తీసుకుంటా
- మమ్మల్ని నమ్ముకున్న వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం
తనకు ఉన్న ప్రజాదరణకు లక్షల మంది ప్రజలు తనను నేరుగా కలవాలని అనుకుంటారని, ప్రతి ఒక్కరినీ కలవడం తనకు వీలు కాదు కనుక రాష్ట్ర కమిటీల ఏర్పాటు ద్వారా వారి సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాబోయే నెల రోజుల్లో జనసేన రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించబోతున్నామని, తద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గతంలో టీడీపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడంపై ఆయన మాట్లాడుతూ, కొత్త రాష్ట్రమనే ఆ పార్టీకి మద్దతు ఇచ్చామని చెప్పారు.