సహస్ర ఘటాభిషేకంతో ముగిసిన వరుణయాగం
- ఐదు రోజుల పాటు జరిగిన వరుణయాగం
- కృష్ణా జలాలతో మల్లేశ్వరస్వామికి అభిషేకం
- రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని యాగం తలపెట్టామన్న అధికారులు
వర్షాలు సమృద్ధిగా కురిసి, రాష్ట్రం పాడిపంటలతో కళకళలాడాలని కోరుతూ తలపెట్టిన ఈ యాగం ముగింపు రోజున కృష్ణా జలాలను తీసుకొచ్చి మల్లేశ్వరస్వామికి పండితులు అభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు తగ్గి, కరవు తొలగిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని తలపెట్టినట్టు స్పష్టం చేశారు.