ప్రధాన ద్వారం కాదు.. వెనుకగేటు నుంచి వెళ్లండి.. ప్రజావేదిక వద్ద టీడీపీ నేతలకు పోలీసుల ఆదేశం!
- తీవ్రంగా మండిపడ్డ టీడీపీ నేతలు
- తాము ఎలాంటి ఆందోళన చేయలేదని స్పష్టీకరణ
- అలాంటప్పుడు ఆంక్షలు ఎందుకు విధించారని ప్రశ్న
- చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టంలేకే కూల్చివేత: బుద్ధా వెంకన్న
ఈ ప్రాంగణం వెనుకగేటు నుంచి వెళ్లాలని సూచించారు. దీనిపై పలువురు టీడీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాము ఎలాంటి గొడవ చేయకపోయినా పోలీసులు ఆంక్షలు విధించడం ఏంటని మండిపడ్డారు. ప్రజావేదికలో మీటింగ్ పెట్టి దాన్నే కూల్చేస్తామని చెప్పడం సరికాదని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలిపారు. చంద్రబాబుకు ప్రజావేదిక ఇవ్వడం ఇష్టంలేకే దాన్ని కూలగొడుతున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని ఇలా వృధా చేయడం కరెక్టు కాదని హితవు పలికారు.