సొంత ఇంటి స్థలం లేని వారు అంటూ రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదు: ఏపీ సీఎం జగన్

  • ఉగాదికి 25 లక్షల ఇంటి స్థలాలు మహిళల పేరిట రిజిస్ట్రేషన్
  • నిజమైన లబ్ధిదారులను గుర్తించాలంటూ జగన్ ఆదేశం
  • దీని కోసం డిస్ట్రిక్ట్ పోర్టల్ ప్రారంభించాలని సూచన
ఏపీలో సొంతిల్లు లేని వారికి ముఖ్యమంత్రి జగన్ తీపి కబురు అందించారు. ఇంటి స్థలం లేనివారు ఒక్కరు కూడా ఉండకూడదని ఆయన అన్నారు. ఈ ఉగాదికి 25 లక్షల ఇంటి స్థలాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. పట్టాలు ఇచ్చేటప్పుడు... ఇంటి స్థలం ఎక్కడుందో లబ్ధిదారులకు చూపించాలని చెప్పారు. దీని కోసం జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ పోర్టల్ ను ప్రారంభించాలని... ప్రతి అంశాన్ని ఆ పోర్టల్ లో పొందుపరచాలని సూచించారు.
Go Back to Shorts
jagan
women
house
land
ysrcp

More Telugu News