మహిళా క్రికెట్ మ్యాచ్ లో కామెడీ సంఘటన!
- ఇంటర్నేషనల్ పోటీల్లో సిల్లీ ఘటన
- అవుట్ చేసే సూపర్ చాన్స్ ను వదిలేసిన క్రీడాకారిణి
- వైరల్ అవుతున్న వీడియో
ఇంతకీ ఏమైందంటే, కేట్ క్రాస్ వేసిన బంతిని, విండీస్ బ్యాటర్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించి రనౌట్ నుంచి తప్పించుకుంది. ఆమె నాన్ స్ట్రయికింగ్ వైపు వెళుతుండగా, ఫీల్డర్ బంతిని అందుకొని బౌలర్ కి త్రో చేసింది. ఆ సమయంలో ఆమెను అవుట్ చేయడం ఎంతో సులువు. కానీ, కేట్ మాత్రం, నాన్ స్ట్రయికింగ్ వైపు నుంచి వెళుతున్న అమ్మాయిని అవుట్ చేసేందుకు చూసింది. ఆ పొరపాటు కామెడీగా ఉండటం గమనార్హం.
ఇక కేట్ క్రాస్ చేసిన పనిని చూసి అంపైర్ సైతం ఆశ్చర్యపోవడం విశేషం. కాగా, ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.