మహిళా క్రికెట్ మ్యాచ్ లో కామెడీ సంఘటన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళా క్రికెట్ మ్యాచ్ లో కామెడీ సంఘటన!

  • ఇంటర్నేషనల్ పోటీల్లో సిల్లీ ఘటన
  • అవుట్ చేసే సూపర్ చాన్స్ ను వదిలేసిన క్రీడాకారిణి
  • వైరల్ అవుతున్న వీడియో
క్రికెట్ పోటీల్లో, అది కూడా అంతర్జాతీయ పోటీల్లో ఇంతకన్నా కామెడీ మరొకటి మీరు చూసుండరేమో!.. ఎందుకంటే, ఇది పొరపాటుగా చేసిందా? లేక కావాలనే చేసిందా? అన్న విషయాన్ని పక్కన పెడితే, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ మహిళా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ లో చోటుచేసుకున్న ఘటన ఇది. ఇంగ్లాండ్‌ బౌలర్‌ కేట్‌ క్రాస్‌ చేసిన పని ఇప్పుడు ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఇంతకీ ఏమైందంటే, కేట్‌ క్రాస్‌ వేసిన బంతిని, విండీస్‌ బ్యాటర్‌ సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించి రనౌట్‌ నుంచి తప్పించుకుంది. ఆమె నాన్ స్ట్రయికింగ్ వైపు వెళుతుండగా, ఫీల్డర్‌ బంతిని అందుకొని బౌలర్‌ కి త్రో చేసింది. ఆ సమయంలో ఆమెను అవుట్ చేయడం ఎంతో సులువు. కానీ, కేట్ మాత్రం, నాన్ స్ట్రయికింగ్ వైపు నుంచి వెళుతున్న అమ్మాయిని అవుట్ చేసేందుకు చూసింది. ఆ పొరపాటు కామెడీగా ఉండటం గమనార్హం.

ఇక కేట్ క్రాస్ చేసిన పనిని చూసి అంపైర్ సైతం ఆశ్చర్యపోవడం విశేషం. కాగా, ఈ మ్యాచ్‌ లో ఇంగ్లాండ్‌ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Westindees
England
Cricket

More Telugu News