Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • విజయ్ దేవరకొండ బ్యానర్లో రష్మిక 
  • మెగా హీరోతో దేవా కట్టా ప్రాజక్టు 
  • సమంత చిత్రానికి బిజినెస్ క్రేజ్ 
  • బన్నీకి ట్యూన్స్ చేస్తున్న తమన్
*  'గీతగోవిందం' చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంట తాజాగా 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. ఇదిలా ఉంచితే, విజయ్ దేవరకొండ తన 'కింగ్ ఆఫ్ ద హిల్' బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా రష్మికను తీసుకున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి.
*  గత కొంత కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉంటున్న దర్శకుడు దేవా కట్టా తన తదుపరి చిత్రాన్ని మెగా హీరో సాయిధరం తేజ్ తో ప్లాన్ చేస్తున్నాడు. దేవా చెప్పిన కథ నచ్చడంతో సాయి ఈ ప్రాజక్టుకి వెంటనే ఓకే చెప్పేశాడట.
*  సమంత ప్రధానపాత్రధారిగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఓ బేబీ' చిత్రానికి ట్రేడ్ వర్గాలలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ చిత్రం కర్ణాటక ఏరియా ప్రదర్శన హక్కులను స్కై హై పిక్చర్స్ సంస్థ 81 లక్షలకు సొంతం చేసుకుంది.
*  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. మరోపక్క, సంగీత దర్శకుడు తమన్ సారథ్యంలో మ్యూజిక్ కంపోజిషన్ కూడా జోరుగా సాగుతోంది.
Rashmika
Vijay Devarakonda
Samantha
Allu Arjun

More Telugu News