గుంటూరు జిల్లా పరిషత్ ‘ఎక్స్ అఫీషియో’ సభ్యుడిగా నారా లోకేశ్!
- నమోదు చేసుకున్న టీడీపీ నేత
- మంగళగిరి అసెంబ్లీ, మున్సిపాలిటీ నుంచి నమోదు
- రేపు సమావేశానికి హాజరుకానున్న లోకేశ్
ఈ నేపథ్యంలో నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం, మున్సిపాలిటీలో తన పేరును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో ఇకపై లోకేశ్ గుంటూరు జిల్లా పరిషత్ లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగుతారు. కాగా, ఈ నెల 23న అంటే రేపు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా నారా లోకేశ్ కు అధికారులు ఆహ్వానం పంపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.