ఇండోనేషియాలో విషాదం.... అగ్గిపుల్లల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 30 మంది మృతి

  • మరణించినవారిలో ముగ్గురు చిన్నారులు
  • ఒక్కసారిగా చెలరేగిన మంటలు
  • గతంలోనూ ఇండోనేషియాలో భారీ ప్రమాదం
ఇండోనేషియా దీవుల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్ లోని బింజాయ్ నగరంలో ఉన్న ఓ అగ్గిపుల్లల ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో 30 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం అందరినీ కలచివేసింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికార వర్గాలు సహాయక చర్యలకు ఉపక్రమించాయి. కాగా, ఈ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు.

ఇండోనేషియాలోని దీవుల్లో ఎన్నో కర్మాగారాలు ఉన్నా, వాటిలో భద్రతాపరమైన చర్యలు అంతంతమాత్రమేనన్న విమర్శలున్నాయి. రెండేళ్ల క్రితం రాజధాని జకార్తా సమీపంలో జరిగిన ఓ భారీ అగ్నిప్రమాదంలో 47 మంది సజీవదహనం అయ్యారు.
Go Back to Shorts
Indonesia
Fire Accident

More Telugu News