విభజనతో ఏపీకి జరిగిన నష్టంపై కేంద్రానికి వివరించాం... ప్రత్యేక హోదా అడిగాం: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

  • పోలవరం, రాజధానికి నిధులు కోరాం
  • ఏపీకి నష్టం జరిగిందని, ఆదుకోవాలని చెప్పాం
  • జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న బుగ్గన
ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రానికి రాష్ట్ర పరిస్థితిని వివరించామని, ప్రత్యేకహోదా అడిగామని తెలిపారు. విభజనతో ఏపీకి నష్టం జరిగిందని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఏపీకి రావాల్సిన నిధుల గురించి కేంద్రానికి చెప్పామని, ముఖ్యంగా పోలవరం ప్రాజక్టు, రాజధాని నిర్మాణానికి నిధులు కోరామని బుగ్గన వెల్లడించారు. విభజన అనంతరం అన్ని విధాలా నష్టపోయిన ఏపీకి సాయం చేయాలని కోరామని తెలిపారు. కాగా, రైతులు, స్వయం సహాయక గ్రూపులకు ఇచ్చే సున్నా వడ్డీ రుణ భారాన్ని కేంద్రమే భరించాలని బుగ్గన అన్నారు. రాష్ట్ర వ్యవహారాల గురించి చెబుతూ, అవినీతి రహిత పాలనే తమ ధ్యేయమని, నవరత్నాల అమలే తమ అజెండా అని ఉద్ఘాటించారు.
Go Back to Shorts
Buggana
Andhra Pradesh
YSRCP

More Telugu News