బిగ్ బాస్-3 ప్రోమో రిలీజ్... ఆ శక్తి గల వ్యక్తి నాగార్జునే అంటున్న నెటిజన్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్-3 ప్రోమో రిలీజ్... ఆ శక్తి గల వ్యక్తి నాగార్జునే అంటున్న నెటిజన్లు!

  • స్టార్ మా చానల్ నుంచి ప్రోమో వీడియో
  • ముసుగు ధరించి ఉన్న హోస్ట్
  • మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తాజా సీజన్ ఆరంభం
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షోగా పేరుగాంచిన వినోద ప్రధాన కార్యక్రమం బిగ్ బాస్. ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే మూడో సీజన్ లో అడుగుపెట్టబోతోంది. తొలి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కు నాని హోస్ట్ లుగా వ్యవహరించగా, మూడో సీజన్ కు ఎవరు హోస్ట్ గా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా, త్వరలోనే బిగ్ బాస్-3 అంటూ ప్రోమో రిలీజ్ అయింది. స్టార్ మా చానల్ నుంచి వచ్చిన ఈ ప్రోమో వీడియో చివర్లో లాంగ్ కోట్ ధరించిన ఓ వ్యక్తి ముఖాన్ని కప్పుకుని కనిపిస్తాడు.

మనసు కోతి వంటిది... అలాంటి మనసున్న కొందరు వ్యక్తులు ఓ ఇంట్లో చేరితే వాళ్లను అధికారంతో నడిపించేది ఎవరు? శక్తి గల ఆ వ్యక్తి ఎవరు? అంటూ ఆ ప్రోమో సాగుతుంది. కాగా, ఆ ముసుగులో ఉన్న వ్యక్తిని బాడీ లాంగ్వేజి ఆధారంగా  అక్కినేని నాగార్జునేగా అని నెటిజన్లు అంటున్నారు. ఆ వ్యక్తి హైట్, వాకింగ్ స్టయిల్ నాగ్ ను తలపిస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాగార్జునకు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించిన అనుభవం ఉంది. ఒకవేళ ఆయనే బిగ్ బాస్ తాజా సీజన్ కు హోస్ట్ అయితే మరింత జనరంజకంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Bigg Boss
Nagarjuna
Host

More Telugu News