ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుడు మోదీ: బ్రిటీష్ హెరాల్డ్ పోల్
- పవర్ ఫుల్ పర్సన్-2019గా మోదీ ఎంపిక
- ఆ తర్వాతి స్థానాల్లో పుతిన్, ట్రంప్, జిన్ పింగ్
- శక్తిమంతమైన నేతగా మోదీని ప్రకటించిన బ్రిటీష్ హెరాల్డ్
ఈ పోల్ లో రష్యా అధినేత పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్ పింగ్ లను మోదీ దాటేశారు. పుతిన్ కు 29.9 శాతం, ట్రంప్ కు 21.9 శాతం, జిన్ పింగ్ కు 18.1 శాతం ఓట్లు పడ్డాయి. ఈ పోల్ కోసం 25 మంది ప్రపంచ స్థాయి నేతలు నామినేట్ కాగా... వీరిలో నలుగురిని ఫైనల్ రౌండ్ కు ఎక్స్ పర్ట్ ప్యానల్ ఎంపిక చేసింది. ఫైనల్స్ లో మోదీ విజేతగా నిలిచారు.