ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుడు మోదీ: బ్రిటీష్ హెరాల్డ్ పోల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుడు మోదీ: బ్రిటీష్ హెరాల్డ్ పోల్

  • పవర్ ఫుల్ పర్సన్-2019గా మోదీ ఎంపిక
  • ఆ తర్వాతి స్థానాల్లో పుతిన్, ట్రంప్, జిన్ పింగ్
  • శక్తిమంతమైన నేతగా మోదీని ప్రకటించిన బ్రిటీష్ హెరాల్డ్
ప్రధాని మోదీ అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని నేతగా ఎదిగారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రముఖ బ్రిటీష్ మేగజీన్ 'బ్రిటీష్ హెరాల్డ్' నిర్వహించిన రీడర్స్ పోల్ లో... పవర్ ఫుల్ పర్సన్-2019గా నరేంద్ర మోదీ ఎంపికయ్యారు. ప్రపంచంలోని ఇతర నేతలను అధిగమించి మోదీ శక్తిమంతమైన నేతగా ఎంపికయ్యారని ఈ సందర్భంగా బ్రిటీష్ హెరాల్డ్ తెలిపింది. ఈ పోల్ లో 30.9 శాతం పాఠకులు మోదీకి ఓటు వేశారు.

ఈ పోల్ లో రష్యా అధినేత పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్ పింగ్ లను మోదీ దాటేశారు. పుతిన్ కు 29.9 శాతం, ట్రంప్ కు 21.9 శాతం, జిన్ పింగ్ కు 18.1 శాతం ఓట్లు పడ్డాయి. ఈ పోల్ కోసం 25 మంది ప్రపంచ స్థాయి నేతలు నామినేట్ కాగా... వీరిలో నలుగురిని ఫైనల్ రౌండ్ కు ఎక్స్ పర్ట్ ప్యానల్ ఎంపిక చేసింది. ఫైనల్స్ లో మోదీ విజేతగా నిలిచారు.
british herald
powerful person 2019
modi

More Telugu News