వివేకా హత్యకేసు దర్యాప్తు ముమ్మరం.. ప్రత్యేక బృందం ఏర్పాటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వివేకా హత్యకేసు దర్యాప్తు ముమ్మరం.. ప్రత్యేక బృందం ఏర్పాటు

  • మార్చిలో వివేకానందరెడ్డి హత్య
  • బుధవారం వివేకా ఇంటిని పరిశీలించిన కొత్త బృందం
  • వాచ్‌మన్ రంగయ్యను విచారించిన అధికారులు
ఈ ఏడాది మార్చిలో హత్యకు గురైన మాజీ మంత్రి, వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం  అనంతపురం, చిత్తూరు, తిరుపతికి చెందిన పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఈ బృందం దర్యాప్తును ముమ్మరం చేయనుంది. కొత్త బృందం బుధవారం వైఎస్ వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించింది.  అనంతపురం జిల్లా పెనుగొండ డీఎస్పీ రామకృష్ణ, పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌, సీఐలు శ్రీరాం‌, అమిత్‌ఖాన్‌, రామాంజినాయక్‌, పలువురు ఎస్‌ఐలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పులివెందులలోని వివేకానందరెడ్డి ఇంటికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వాచ్‌మన్‌ రంగయ్యను విచారించారు.

మార్చి 15న జరిగిన వివేకా హత్యకేసు అప్పట్లో పెను సంచలనమైంది. ఈ హత్యకేసుపై వెంటనే స్పందించిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, ఎన్నికల నేపథ్యంలో దర్యాప్తు ముందుకు సాగలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
YSRCP
YS vivekananda reddy
pulivendula
Kadapa District

More Telugu News