జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ ఈ నెల 26కు వాయిదా!
- ఎన్ఐఏ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు
- వాదనలు వినిపించిన ఇరుపక్షాలు
- గతేడాది అక్టోబర్ 25న జగన్ పై దాడి
శ్రీనివాస్ లాంటి క్రిమినల్ బయట ఉంటే ప్రమాదమని వాదించారు. అయితే ఈ వాదనలను శ్రీనివాస్ న్యాయవాది ఖండించారు. బెయిల్ జారీ సందర్భంగా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు శ్రీనివాస్ నడుచుకుంటున్నారనీ, ఎక్కడా బెయిల్ నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.
ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్ పై తదుపరి విచారణను జూన్ 26కు వాయిదా వేసింది. ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొని హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో 2018, అక్టోబర్ 25న శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ జగన్, హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు.