నరసరావుపేటలో డాక్టరు దంపతులపై దాడి.. వైసీపీ కార్యకర్తలపై ఆరోపణలు!
- ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే ఈ దాడి జరిగింది
- గన్ మన్ సాయంతో కార్యకర్తలు దౌర్జన్యం చేశారు
- ఆసుపత్రి ఎలా నడుపుతారో చూస్తానని సీఐ బెదిరించారు
తమ ఆసుపత్రిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని, ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే ఈ దాడి జరిగిందని వైద్యురాలు రమ్య ఆరోపించారు. ఎమ్మెల్యే గన్ మన్ సాయంతో వైసీపీ కార్యకర్తలు తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. పోలీసులపైనా ఆమె ఆరోపణలు చేశారు. ఈ ఆసుపత్రి ఎలా నడుపుతారో చూస్తానని సీఐ బిలాలుద్దీన్ తమను బెదిరించారని రమ్య ఆరోపించారు.